గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలలోకి పోతే అయిజ మండల కేంద్రం లో జయలక్ష్మి ఏజెన్సీ సిగిరెట్ షాప్ లో ఈ నెల 11-07-2025 రోజున దాదాపు 18 లక్షల రూపాయలు ఖరీదు చేసే సిగిరెట్ ప్యాకింగ్ కాటన్స్ ను దొంగతనం చేయడం జరిగింది ఇదో వింత రకమైన దొంగతనం అందరు దొంగలు ఎక్కువ శాతం బంగారు అభరణాలు. డబ్బులు. ఇలా పలు రకాలుగా ఉన్న దొంగతనాలు చేయడం చూసాము కాని ఈ రాజస్థాన్ కు సంబందించిన దొంగలు మాత్రం చరిత్ర చెప్పుకునే విదంగా తమదైనా శైలిలో ఒక వింత విధానం లో త్రాగి పడేసే సిగిరెట్స్ దొంగతనం చేయడం ఆశ్చర్యం కలిగించిది సిగిరెట్స్ ప్యాక్ కాటన్స్ ను దొంగతనం చేసిన వ్యక్తులను మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది తదుపరి అ వ్యక్తులను రిమాండ్ కు పంపడం జరిగింది