గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ ప్రతినిత్యం ఖరీదైనా కలప ను అక్రమంగా తరలించడం జరుగుతుంది. ఒక పక్కన ప్రభుత్వాలు కోట్ల రూపాయలు హెచ్చించి పర్యావరణము కాపాడటానికి వృక్షము లను నటించడం జరుగుతుంది మరోపక్క ఈ అక్రమ కలప స్మగ్లింగ్ వ్యాపారస్థులు తరలించడం జరుగుతుంది పూర్తి వివరాలలోకి పోతే గద్వాల మండలానికి సంబందించిన "మేలచెరువు " గ్రామ వాసి అయినా రామాంజనేయులు అనే వ్యక్తి ఒకే ఒక్కసారి మాత్రమే ఫారెస్ట్ అధికారులనుండి ఒక్క లోడ్ కలపకు అనుమతులు తీసుకోవడం జరుగుతుంది అ ఒక్కసారి తీసుకున్న అనుమతుల లెటర్ ను అడ్డుపెట్టుకొని రెండు రోజులకు ఒక్కసారి 15 లోడ్ లకు సంబందించిన ఖరీదైనది వేప. తుమ్మ.చింత. మామిడి. నల్లమద్ది. రేగి. నీళగిరి. టేకు. ఇతర వంటి కలపను వృక్ష యాజమాన్యం దగ్గర కొంతమంది నుండి అతి తక్కువ ఖరీదు చెల్లించి తదుపరి కొంత కలప దొంగతనంగా బీడు భూములనుండి. బంజర్ భూములనుండి. అక్రమంగా ఖరీదు అయినా కలప ను నరికించి ప్రతి రెండు లేదా మూడు రోజులకు 10.15 ట్రాక్టర్ల లోడ్ చేసుకొని అ కలపను కర్ణాటక ప్రాంతం నకు తరలించడం జరుగుతుంది.. కాని ఈ అక్రమ కలప స్మగ్లింగ్ వ్యాపారం ఫారెస్ట్ అధికారులకు సవాల్ గా మారడం జరుగుతుంది. ఈ వ్యక్తికి సపోర్టు గా వార్డు కౌన్సిలర్ లు.స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధులు సహకారం తో అధికారులకు పట్టుబడిన వీరి రేకమేండెషన్ తో ఎలాంటి చర్యలు లేకుండా వదిలి పెట్టడం జరుగుతుంది కాబట్టి జిల్లా ఫారెస్ట్ అధికారులు. కలెక్టర్ స్పందించి ఇలాంటి అక్రమ కలప స్మగ్లింగ్ వ్యాపారస్థుల పై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.