గూడూరు, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్మాగారాల విభాగం ఆధ్వర్యం లో గూడూరు డివిజన్ స్థాయి ఎల్సిజి కమిటీ(రసాయన ప్రమాదాలు- అత్యవసర ప్రణాళిక, సంసిద్ధత, ప్రతిస్పందన సమూహం) సమావేశం మంగళవారం సబ్ కలెక్టర్, ఎల్ సీ జీ చైర్మన్ రాఘవేంద్ర మీనా అధ్యక్షతన స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలలో రసాయనిక ప్రమాదాల సమయాలలో కార్మికులు, ప్రజల భద్రత, ఆరోగ్యం గురించి తీసుకోవలసిన భధ్రతా చర్యలను గురించి చర్చించారు.అత్యవసర పరిస్థితి లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆయన వివరించారు.ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్,ఎల్ సీ జీ మెంబర్ కన్వీనర్ ఎన్ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల ద్వారా
రసాయన ప్రమాదాలను ఎదుర్కోవటానికి, రసాయన ప్రమాదాల ప్రణాళిక, సంసిద్ధత తగ్గించడంలో ప్రయత్నాలను సమన్వయం చేయడానికి స్థానిక సంక్షోభ సమూహం(ఎల్ సీ జీ) పారిశ్రామిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. ఈ సమావేశం లో లో గూడూరు అగ్నిమపక శాఖ అధికారి డివి రమణయ్య,ఎంపీడీఓ,వైద్య సిబ్బంది డాక్టర్ రోహిత్ రెడ్డి, డాక్టర్ రేష్మ,జ్యోతి,కలర్ షైన్ ప్రతినిధులు డిపి సింగ్,జయశ్రీ, సునీల్ రెడ్డి ,లోకేష్,విజయ్ కుమార్, ఎల్ సీ జీ సభ్యులు ఉడతా శరత్ యాదవ్, సూర్య ప్రతాప్ రాయల్, జానా సుధీర్, పెంచలయ్య తదితరులు పాల్గొనారు.