గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం గూర్చి అవగాహన సదస్సు 16వ సచివాలయం లో వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆ ఏరియా మాజీ కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం ప్రజలు, ప్రభుత్వం దాతలు కలసి రాష్ట్రంలో దారిద్యరేఖకు దిగువన ఉన్న 20 శాతం మంది ప్రజలకు ఆర్థికంగా ఎదిగేందుకు విద్య, ఉపాధి అవకాశాలు అందించేందుకు ధనవంతులైన వారు వ్యక్తిగతంగా కానీ వారి సంస్థల ద్వారా గాని సహకారం అందించి రాబోవు 2047వ సంవత్సరం లోపల పేదరికం రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించే బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేపట్టారని , దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, సచివాలయం సిబ్బంది మీ వార్డు పరిధిలోని పేదలను గుర్తించి, సరైన లబ్దిదారుల జాబితాను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులైన ఎస్సీ సెల్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ వేల్పుల రమేష్ కుమార్, 17వ యూనిట్ ఇంచార్జ్ ఆవుల వెంకటేశ్వర్లు , పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు యదనపర్తి మధురెడ్డి, 26వ వార్డు టిడిపి అధ్యక్షుడు నరసరాజు, టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు లల్లు ప్రసాద్ యాదవ్, 16వ సచివాలయ సిబ్బంది మరియు సచివాలయ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లి, మాళవ్య నగర్, ఇందిరా నగర్ ప్రజలు పాల్గొన్నారు.