గూడూరు, మన న్యూస్:- కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో ఏడాది దాటి పోతున్నా నిర్లక్ష్యం వహిస్తూ నిర్దిష్టమైన హామీలు, ఒప్పందాలకు సంబంధించిన జి.ఓ. లు అమలు చేయకపోవడంతో రాష్ట్ర జిల్లా కమిటీ లో ఇచ్చిన పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె మంగళవారానికి 10వ రోజుకు చేరుకొంది. అదే బాటలో వార్షిక కార్మికుల సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అనారోగ్యం పాలైన కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు జరపాలి ఎక్స్గ్రేషియా ఐదు లక్షల నుండి 7 లక్షల రూపాయలు పెంచాలి అంతక్రియలకు 20వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75వేలు ఇవ్వాలి, గ్రాడ్యూటీ అమలు చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులకు జి.ఓ.నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలి, పై డిమాండ్లు అమలు చేసేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని డిమాండ్ చేశారు. సమ్మె జరుగుతున్న శిబిరం వద్దకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ సి.ఐ.టి.యు అనుబంధం ఆధ్వర్యంలో అధ్యక్షులు ఏ.మనోజ్ కుమార్ కార్యదర్శి యన్.శివకుమార్ నాయకులు చేరుకొని తమ పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ధారా కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జోగి.శివకుమార్, సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య,భూలోకం మురళి,నల్లిపాక వెంకటరమణ, జీ.మని,పద్మమ్మ,నారాయణమ్మ, వరలక్ష్మి,మేరీ,యస్.డి.నయీo, కామేశ్వరరావు,అడపాల ప్రసాద్ ఏంబేటి చంద్రయ్య,గుర్రం రమణయ్య,ఎస్కే.జిలాని బాషా, గండికోట మధు,బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.