గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సి.ఐ.టి.యు నాయకులు మంగళవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ తేదీ 21.07.2025 దినం ఉదయం సుమారు 11.30 గంటలకు సమయంలో నెల్లటూరు గ్రామo లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న గిరిజన మహిళ సంబంధించిన సమస్యపై సి.ఐ.టి.యు నాయకులు గూడూరు మున్సిపల్ కమిషనర్ గారితో ఆయన చాంబర్ లో మాట్లాడుటకు పోయిన సి.ఐటి.యు నాయకుల పై గూడూరు మున్సిపాలిటీ కమీషనర్ దురుసుగా అసభ్య కరంగా, బూతులు..... మాట్లాడడం జరిగిందని,ఆ విషయమై మేము ప్రశ్నించగా మీరు నా చాంబర్ నుండి వెంటనే బయటికి వెళ్లిపోండి. ఇకనుంచి మీరు ఎప్పుడు ఇక్కడికి రావద్దు .. అంటూ పైకి లేచి మాట్లాడి మాపై దూకినాడు, కావున తమరు మా యందు దయవుంచి పై విషయాన్ని పరిశీలించి సి.ఐ.టి.యు నాయకులు మీద దురుసుగా మాట్లాడిన కమిషనర్ పైన తగు చర్యలు తీసుకో వలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.
రమణయ్య, కె.వి.పి.ఎస్ నాయకులు అడపాల ప్రసాద్,ఏంబేటి చంద్రయ్య, భవన కార్మిక సంఘం సీనియర్ నాయకులు పుట్టా శంకరయ్య, గండికోట మధు,గుర్రం రమణయ్య,ఎస్.ముత్యాలయ్య,బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.