రోటరీ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డీలు ….… ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మాధురి, లక్ష్మీ లు
గూడూరు,మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ లకు 2025-26 సేవా సంవత్సరమునకు నూతన పాలకవర్గాలు సోమవారం బాధ్యతలు చేపట్టాయి.స్థానిక సీ ఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోటరీ ప్రముఖులు రొటేరియన్స్ బొమ్మిరెడ్డి సురేంద్ర రెడ్డి, డాక్టర్ సి. జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణీ దంపతులు, భరత్ రెడ్డి, కొణిదల మునిగిరీష్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో గూడూరు రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ విభాగాలకు వున్న ప్రత్యేక గుర్తింపును కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమాలతో రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ లు ప్రజలకు సేవాలాందించాలని వారు ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు రెడ్డి,మల్లు విజయ్ కుమార్ రెడ్డీలు,ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మాధురి, లక్ష్మీ లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేప ట్టారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రముఖులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంటి రామ్మోహన్ రావు, శ్రీధర్ రెడ్డి, జీజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఎస్ కే ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రింటర్ ను బహుకరించారు.