మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక నర్సీపట్నం రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పట్టణ నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో,వివేకానంద సేవా సమితి సభ్యులు, రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.అనంతరం జనసేన నాయకులు పొట్టా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరం నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. అలాగే ఇప్పటివరకు సుమారు 200 మందిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారని,20 మందిని ఉచిత ఆపరేషన్ నిమిత్తం జగ్గంపేట రాజేశ్వరి లైన్స్ కంటి ఆసుపత్రికి పంపించడం జరుగుతుందన్నారు.వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ శరీరంలో కళ్ళు అతి ముఖ్యమైన భాగమని దానిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పెంటకోట మోహన్, పాండ్రికి సత్యనారాయణ,శివనాని శ్రీను,రాజు, బ్రహ్మానందం,గంగిరెడ్ల మణికంఠ,వరుపుల నాగేశ్వరరావు, బొరుసు సురేష్,పలివెల వెంకటేష్, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.