శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోశాల పథకాన్ని అధికారులు అధికార పార్టీ నేతలకు ఎటువంటి జంతువులు లేకపోయినా వారికి గోశాల షెడ్లు వారికి ఇచ్చి అర్హులైన రైతులకు గోశాల షెడ్లు ఇవ్వకుండా కార్యకర్తలకు గోశాల షెడ్లు అధికారులు మంజూరు చేశారని చేపట్టాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని చిన్న శంకర్లపూడి గ్రామానికి చెందిన రైతు ఏపూరి శ్రీనివాసరావు తెలిపారు. ఏపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో సుమారు నాకు 20 ఆవులు ఉన్నప్పటికీ గోశాల షెడ్డు మంజూరు చేయమని అధికారులకు పంచాయితీ తీర్మానం చేసి ఇచ్చినప్పటికీ లబ్ధిదారుడిగా నాకు షెడ్డు మంజూరు చేయకుండా ఎటువంటి జంతువులు లేకపోయినా ఆ పార్టీ కార్యకర్తలకు గోశాల షెడ్లు మంజూరు చేశారని దీనిపై విచారణ చేయాలని ఎమ్మెల్యే సత్యప్రభ గ్రామంలో జరిగిన గోశాల షెడ్డు నిర్మాణాలపై తక్షణ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.