మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా ఓబ్లాపూర్ అంజప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ పట్టణంలోని సంతబజార్ వద్ద ఉన్న బీరప్ప ఆలయం వద్ద తాలూకా కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు దేవరి మల్లప్ప, తంగిడి నాగరాజ్, ఎల్లాలింగ, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాలూకా కమిటీ ఉపాధ్యక్షులుగా జి.నర్సిములు, గోవర్దన్, రాజు (కున్షి), కార్యదర్శిగా వీరేశ్ (మక్తల్), ఉప కార్యదర్శి గా అమ్మపల్లి నర్సిములు, కోశాధికారిగా నందిమల్ల ఆంజనేయులు, కమిటీ సభ్యులుగా చేగుంట సిద్దు, కొల్లూరు నింగప్ప, కొత్తపల్లి శంకరప్ప ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ కార్యవర్గంను శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాదాసి కురువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.