మన న్యూస్ సాలూరు జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచారని మాజీ డిప్యూటీ సీఎం పిడికిరాజన్న దొర అన్నారు. నేను మాట ఇస్తే తప్పకుండా ఆ మాటకు కట్టుబడి పనిచేసే తీరుతానని అన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం కురుకూటి గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామానికి చేరుకున్న రాజన్నకు గ్రామస్తులు ఆదివాసీలు నృత్యాలతో అలరించిన పిదప, మహిళలు మంగళ హారతులిచ్చి పూలమాలలతో స్వాగింతించారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ, ఎన్నికలలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. తీరా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. అలాగే మంత్రి సంధ్యారాణి ఈ గ్రామంలో ఏం చేశారని అన్నారు. 2015 నుండి 2021 వరకు ఎమ్మెల్సీగా ఉన్న ఆరేళ్లలో సంధ్యారాణి నియోజవర్గ అభివృద్ధికై ఏ విధంగా పాటుపడ్డారో తెలియజేయాలన్నారు. ప్రజలకు హామీలిచ్చి వెళ్ళిపోవడం కాదన్నారు. హామీలు ఇస్తే తప్పక నెరవేర్చాలన్నారు. అలాగే నేను నాలుగు తరాలు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి తన వంతుగా అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశానో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. పార్టీలకతీతంగా అందరికీ సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశాను కనుకా నన్ను నాలుగు దపాలు మీరందరూ గెలిపించారన్నారు. అనంతరం చంద్రబాబునాయుడు చేసిన మోసాల జాబితా తాలుకా కరపత్రాలను ప్రతి ఇంటికి ఇచ్చి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, భరత్ శ్రీనివాస్, దండి శీను తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.