మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ పట్టణంలోని పట్టం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి గానూ జరిగిన 23వ లయన్స్ క్లబ్ మఖ్తల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో భాగంగా అధ్యక్షుడిగా సత్యాంజనేయులు, సెక్రటరీగా అంజన్ ప్రసాద్, కోశాధికారిగా ఆడం సత్యనారాయణ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా హరినారాయణ బట్టడ్, క్లబ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నటరాజ్, క్యాలెండర్ ఈవెంట్స్ చైర్మన్ నాగరాజ్, జోన్ చైర్మన్ సూగురు జైపాల్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ గవినోళ్ల గోపాల్ రెడ్డి, కోచర్ పర్సన్ కాకులారం అశోక్ ,డిస్టిక్ కోనేటర్ ఆత్మారావు ఎట్ కె,పాస్ట్ జడ్సీలు కొండయ్య, ఆశి రెడ్డి, డాక్టర్ శ్రీరామ్, కడుమూరు శ్రీనివాస్, ఎ.రవి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత మెల్విన్ జోన్స్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు చేసిన భరతనాట్య నృత్యప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.గతేడాది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల గురించి పాస్ట్ ప్రెసిడెంట్ డివి చారి వివరించారు. అనంతరం నూతన కమిటీచే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యులకు డాక్టర్స్ డే సందర్భంగా శాలువా కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఇక వర్షాల కారణంగా మట్టిళ్లలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు వర్షాలకు తడవకుండా పాలిథిన్ కవర్లను పంపిణీ చేశారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సుమారు 600 నోటుబుక్కులను పంపిణీ చేశారు. నూతన లయన్స్ క్లబ్ సభ్యులుగా వాకిటి రమేష్, డాక్టర్ మణికంఠ గౌడ్, డాక్టర్ రాజేష్ గౌడ్ ప్రమాణం చేశారు. నూతన కమిటీతోపాటు జాయింట్ సెక్రటరీగా మామిళ్ళ పృథ్వీరాజ్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా టి.నాగరాజు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా కావలి తాయప్ప, థర్డ్ వైస్ ప్రెసిడెంట్ గా జయశ్రీ టీచర్, మెంబర్ షిప్ కమిటీ చైర్ పర్సన్ గా కోళ్ల వెంకటేష్, మెంబర్ షిప్ కమిటీ ఉమెన్ చైర్ పర్సన్ గా అరుణ టీచర్, క్లబ్ మార్కెటింగ్ చైర్ పర్సన్ గా రవికుమార్ గౌడ్, అడ్మినిస్ట్రేటర్ గా వీరేశం, కోఆర్డినేటర్ గా గవినోళ్ల జయపాల్ రెడ్డి, సర్వీస్ చైర్పర్సన్ గా వాదిరాజ్, సేఫ్టీ ఆఫీసర్ గా పాపిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా కట్ట వెంకటేష్, వీఆర్వో గా చంద్రశేఖర్, టెయిల్ ట్విస్టర్ గా అరవింద్, లయన్ టేమర్ గా సాయి జ్యోతి వెంకటయ్య ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ పెద్దలు మాట్లాడుతూ,మెల్విన్ జోన్స్ సారథ్యంలో లయన్స్ క్లబ్ ఏర్పాటై ప్రస్తుతం 200 పైగా దేశాలకు విస్తరించి, లక్షలాదిమంది సభ్యులు ఉన్న అతిపెద్ద సేవా సంస్థ లయన్స్ క్లబ్ అని కొనియాడారు. మానవసేవయే మాధవసేవ అని, సేవ చేయడంలో ఉన్న గొప్పదనం అనుభవిస్తే గాని తెలియదని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సేవ చేస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఫాస్ట్ ప్రెసిడెంట్, వై.వీరేశం,కర్ని స్వామి, బి. అంబాదాస్ రావు ,రాజశేఖర్ రెడ్డి అంజి రెడ్డి, శరణప్ప, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.