మన న్యూస్, తిరుపతి :- చిత్తూరు జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ - 15, అండర్ - 17 బాలికల,బాలుర సింగిల్స్ - డబుల్ జట్లు అలాగే మెన్, ఉమెన్ సింగల్స్, డబుల్స్ జట్ల ఎంపిక పోటీలు సోమవారం జరిగింది. తిరుపతి లోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ సెలక్షన్ పోటీ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆనందరెడ్డి, కార్యదర్శి పి.రామకృష్ణయ్య, అధ్యక్షుడు కే.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సి.హెచ్.కిరణ్ కుమార్, కోశాధికారి జి.శివయ్య ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈపోటీలలో గెలిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు తెలియజేశారు. ఈ పోటీలలో బాలుర అండర్ - 15 సింగిల్స్ విభాగంలో విన్నర్ గా ప్రణవ్, రన్నర్ గా కె. ప్రేమ్ అబినయ్ బాలికల విభాగంలో విన్నర్ గా పి.కీర్తన, రన్నర్ గా మన్విత, అండర్ -17 సింగిల్స్ బాలురు విభాగంలో విన్నర్ గాడి.ధీరజ్, రన్నర్ గా జి.కార్తీక్, బాలికల విభాగంలో విన్నర్ గా పి.కీర్తన, రన్నర్ గా ఆర్.మన్విత విజయం సాధించారు. మెన్స్ సింగిల్స్ లో విన్నర్ గా టీ. ప్రణవ్ సాయి, రన్నర్ గా డి ధీరజ్, ఉమెన్ సింగల్స్ విభాగంలో విన్నర్ గా సి జోత్స్న, రన్నర్ గా కే.సింధు నిలిచారు. బాయ్స్ అండ్ 15 డబుల్ విభాగంలో విన్నర్స్ గా ఏ కృతికేష్, టీ మౌనిష్, రన్నర్స్ గా దేవాన్ష్, షాహీర్లు నిలిచారు. అండర్ 15 గర్ల్స్ డబుల్స్ విభాగంలో విన్నర్స్ గా ఆయేష్ణ అక్షర రమేష్ గా జీవిత సిరి చందనలు నిలిచారు. అండర్ 17 గర్ల్స్ డబుల్స్ విభాగంలో విన్నర్స్ గా బి.సాన్వి, ఎం.యోషిత నిలిచారు. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో విన్నర్స్ గా సింధు- అఖిల సాయి, రన్నర్స్ గా లయ-లావణ్య నిలిచారు. అండర్ 17 బాయ్స్ డబుల్స్ విభాగంలో విన్నర్స్ గా జి.కార్తీక్ - ఏ ప్రణవ్, రన్నర్స్ గా ఏ భగత్ - ఏ హరీష్ విజయం సాధించారు. మెన్స్ డబుల్ భాగంలో విన్నర్స్ గా ఎన్.సృజన్- ఎన్.అరుణ్, రన్నర్స్ గా శరత్ - మనోజ్ లు నిలిచారు. ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో బ్యాట్మెంటన్ జిల్లా సెలక్షన్స్ జరిగాయని, విజయం సాధించిన జట్లకు చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అభినందనలు తెలియజేసింది. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.