మన న్యూస్: జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన జనవాని కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే గారిని శ్రీనివాసులతోపాటు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి లు అర్జీలను స్వీకరించారు. నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారిని ఇచ్చిన దరఖాస్తులను తీసుకొని పరిష్కరించే దిశగా పార్టీ శ్రేణులు చొరవ చూపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన జనసేన నాయకులు బాబ్జి పాల్గొన్నారు.