మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దశాబ్దాల తరబడి తాము సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని తరచూ రెవిన్యూ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడానికి కారణం ఏమిటని పాచిపెంట మండలం కొటికి పెంట పంచాయితీ సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొత్త పేట ఒలిసలమడ గిరిజన రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం నాడు 40 మంది గిరిజన కుటుంబాల ప్రజలు తాసిల్దారు కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ తాసిల్దారు రవికి వినతి పత్రం అందజేశారు. తన పంచాయతీలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు తాము అధికారులతో పోరాడుతానని, గిరిజనులకు అండగా ఉంటానని సర్పంచ్ అప్పలనాయుడు మద్దతు పలికారు. నాగరికత తెలియని గిరిజన ప్రజలు రెండు దశాబ్దాలుగా ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదని ఆవేదన చెందారు.వీరి బ్రతుకులు ఇంతేనా మారవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2001 సర్వేనెంబర్ లో సాగు చేస్తున్న భూములు అటవీశాఖ అధికారులు తమ వంతు ఆ భూమి మీద నుంచి గిరిజన రైతులను వెళ్ళగొడుతున్నారని వెంటనే సంబంధిత తాసిల్దారు స్పందించి సర్వే నిర్వహించి అమాయక గిరిజనులకు న్యాయం జరిగే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని సర్పంచ్ అప్పలనాయుడు కోరుతున్నారు. సాగు చేస్తున్న భూములకు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు రాకపోవడంతో కనీస అవసరాలు తీరక కపోవడంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి చెందక దయనందిక జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి స్పందించి రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసి మా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఒలిసలమడ, కొత్తపేట గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.