
ఉరవకొండ మన న్యూస్ :చిన్న గడే హోతూర్లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న లెక్కలమాస్టర్ సతీష్ హై స్కూల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా, అసభ్య కరంగా ప్రవర్తించిన సంఘటన ఫై ఉపవిధ్యాధికారిమల్లా రెడ్డి సోమవారం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. 8,9,10వ తరగతుల్లో చదువే భాదిత బాలికలనుకలసి విచారించారు.విచారణ గుట్టుగా జరుపుతున్నారని తెలుసు కున్న అల్ ఇండియా స్టు డెంట్స్ఫెడరేషన్ విద్యార్థి సంఘం నేతలు విచారణ అధికారిని కలసి భాధ్యుడైన టీచర్ సతీష్ ను విధుల నుంచి మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటన లకు తావివ్వకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఐసా కన్వీనర్ భీమేష్ డిమాండ్ చేశారు.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడితే అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే అలాంటి కీచకులు పట్ల కఠినంగా వ్యవహరించి తీరాల్సిందే అని హెచ్చరించారు. విద్యార్థినుల పట్ల వక్రబుద్ధి చూపే వక్ర గురువులకు కఠిన దండన విధించాల్సిందే అని ఐసా కన్వీనర్ భీమేష్ డిమాండ్ చేశారు. ఉరవకొండ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల తీరు సరిగ్గా లేదని, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ యాజమాన్యాలు ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు, ఉపాధ్యాయుల శ్రమ దోపిడీ, ఫీజుల దోపిడీ నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని ఉపవిద్యాధికారి మల్లారెడ్డిని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో ఐసా నాయకులు వంశీ, వంశీ,మోహన్ వినయ్ తదితరులు పాల్గొన్నారు