రోడ్డు, భవనాల శాఖ మంత్రికి సీపీఐ నాయకుల వినతి
గూడూరు, మన న్యూస్ :- గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని సోమవారం ఆర్ అండ్ బీ మినిస్టర్ జనార్దన్ రెడ్డికి సీపీఐ నాయకులు వినతిపత్రాన్ని. నాయకులు మాట్లాడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి, పంబలేరు వంతెన, ఆర్అండ్ బీ అతిథిగృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశికుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, సీనియర్ నాయకులు సీవీఆర్. కుమార్, ఇన్సాఫ్ సమితి సభ్యులు షేక్ జమాలుల్లా, మాజీ ఏఐవైఎఫ్ నాయకులు ఎం. సునీల్ పాల్గొన్నారు.