గూడూరు, మన న్యూస్ :- కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్య కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అమలు చేసేంతవరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె సోమవారానికి 9వ రోజుకు చేరుకొంది. అదే బాటలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టి 6వ రోజుకు చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలు నుండి వారి సమస్యలు పరిష్కరిస్తాం అని పాలకులు వాగ్దానాలతోనే ప్రభుత్వాలు మారిపోతున్నాయని వారి పరిస్థితి ఎవరూ పట్టించుకునే వారే లేరని, వాళ్లు చాలీచాలని జీతాలతో పడుతున్న బాధలు అర్థం చేసుకొని ప్రభుత్వం కమిటీని వేసి ఉన్నతాధికారులతో మంత్రులతో వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలని, డిమాండ్ చేశారు. సమ్మె జరుగుతున్న శిబిరానికి అంగన్వాడి వర్కర్స్ చేరుకొని తమ పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా కార్యదర్శి ధారా కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య, అడపాల ప్రసాద్, గుర్రం రమణయ్య, ఎంభేటి చంద్రయ్య, అంగన్వాడి వర్కర్స్ రూరల్ అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతి, సెక్టార్ లీడర్లు ఎస్.కె.ఆసియా బేగం,లక్ష్మి, భారతమ్మ, పెంచలమ్మ, ప్రభావతి, రాజేశ్వరి, అలేఖ్య,భూలోకం,మురళి,ఎన్. వెంకటరమణ,శాంతి వర్ధన్, మణెమ్మ,నారాయణమ్మ, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.