జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు రావడం చాలా సంతోషం… సీఎం చంద్రబాబు
ఎస్ఆర్ పురం,మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు రావడం చాలా సంతోషం నీ సేవలో చాలా బాగున్నాయి అని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.. శనివారం తిరుపతి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి సాలవ తో సన్మానించి సత్కరించారు.. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చిత్తూరు తర్చూరు జాతీయ రహదారి పరిధిలో ఎస్ఆర్ పురం మండలం పాతపాలెం, బాలగంగాన పల్లి పరిధిలో పాలి హౌస్, బయోటెక్ రెండు పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు స్థల పరిశీలన చేశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలియజేయడంతో వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను అభినందించి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నీ సేవలో చాలా బాగున్నాయి అభివృద్ధికి ఏమి కావాలన్నా అందిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జీడీ నెల్లూరు టిడిపి యువ నాయకుడు హరీష్ యాదవ్, ఆర్ టి ఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్, మాజీ సర్పంచ్ కుప్పయ్య, యువత ప్రధాన కార్యదర్శి నాగరాజు, గోపిశెట్టిపల్లి రాజా, నాయకులు తదితరులు పాల్గొన్నారు