మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇంటి నుండి దూరమై కొన్ని నెలలుగా గడిచిన ఒక వ్యక్తి కాకినాడ జిల్లా,ప్రత్తిపాడులో దీనస్థితిలో ఉన్నాడు.శనివారం స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో అతన్ని శుభ్రపరిచి మంచి బట్టలు తొలగించారు.స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు,అడపా సుబ్రహ్మణ్యం మరికొందరు పెద్దలు కలిసి ఆదరించి బాగు పరిచారు.తన పేరు సరిది అప్పలనాయుడు అడ్రస్ విజయనగరం జిల్లా,మెరకముడిదాం మండలం, బుదరాయవలస గ్రామం అన్నట్లుగా నెమ్మదిగా చెబుతున్నాడు. తన అన్నయ్య పేరు సరిది పాపి నాయుడు అని,తమ గ్రామ పెద్ద రెండ సూరి నాయుడు అన్నట్లు గా చెప్పాడు.ఇతన్ని తమ సొంత ఇంటికి చేరేలా ఈ సమాచారాన్ని విజయనగరం జిల్లా వారికి షేర్ చేసి ఈ క్రింది ఫోన్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా వారి సందర్భంగా తెలిపారు. 7396443227 (నాగు ఫ్రొం ఎర్రవరం )కు ఫోన్ చెయమనండి. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఇతను ఆచూకీ గురించి వివరిస్తే పోలీసుల సహాయంతో వారి సొంత ఇంటికి అతన్ని చేర్చే ఏర్పాటు చేయగలరని వారీ సందర్భంగా వెల్లడించారు.