మన న్యూస్,తిరుపతి :- పదవతరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరచిన గౌడ విద్యార్థులకు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు దిండుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో నేడు, స్థానిక శివశక్తి కల్యాణ మండపంలో సుమారు 100 మంది విద్యార్థులకు సిల్వర్ మెడల్ .మెమొంటో.
బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ కే ఇ ప్రభాకర్ , మాజీ డి జీ పి ఈడే అశోక్ కుమార్ గౌడ్ , రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వర్లు, జిల్లా గౌడ సంఘం మాజీ అధ్యక్షులు యార్లపల్లి గోపి గౌడ్ , మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్షి శైలజా గౌడ్ , తదితరులు పాల్గొని ప్రశంగించడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ.., విద్యార్థులు పై చదువులు చదివి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్లాలని తద్వారా కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేసారు.
పై కార్యక్రమంలో మహిమలూరి శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షులు అరగొండ నరసింహులు గౌడ్ , మద్దిలేటి కృష్ణమూర్తి, కంభం లోకనాధం తదితరులు పాల్గొన్నారు