గూడూరు, మన న్యూస్ :- నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే మొదలయ్యిందని , వైసీపీ లో ఉన్న వారి వ్యాపారాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి నాకు లేదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు . తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ పై విమర్శలు చేశారు . గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు మహిళలను ఇబ్బంది పెడితే కేసులు పెట్టకుండా ఊరుకోవాలా అని ప్రశ్నించారు . వైసీపీ పాలనలో పోలీసులను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ వారిపై అనేక అసత్య ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు తన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైందని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని వివరించారు . వైసిపి పాలనలో సిలికా , క్వార్ట్జ్ యదేచ్చగా అక్రమమైన జరిగిందని పేర్కొన్నారు. తాను నిజం ప్రజల్లో ఉండటాన్ని చూసి ఓర్వలేక వైసిపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు .గూడూరు పట్టణంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు . ఫ్లై ఓవర్ బ్రిడ్జి ,పంబలేరు బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు గూడూరు లో రౌడీయిజం ను ప్రోత్సహించే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు , గూడూరును తిరుపతి లో కలిపిన పాపం వైసీపీ వాళ్లదే అన్నారు .