మన న్యూస్ :=పాచిపెంట, మన్యం జిల్లా పాచిపెంట లో రైతులు పిర్యాదులు మేరకు పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా డీలర్ల అవినీతి అక్రమాలు బయట పడ్డాయని వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతిరావు విలేకరులకు తెలియజేశారు.పాచిపెంట మండలంలో శ్రీ కృష్ణా స్టోర్స్ మరియు భూర త్రినాధ ఎరువుల షాపులలో ఆకస్మిక తనిఖీ చేయగా సరియైన రసీదులు ఇవ్వకుండా రైతులకు ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు వ్యవసాయ అధికారి తిరుపతిరావు తెలిపారు. అంతేకాకుండా నచ్చిన వారికి నచ్చిన విధంగా నచ్చిన రీతిలో వారి సొంతంగా ధరలు నిర్ణయించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా విక్రయాలు జరుపుతున్నారని తెలియజేశారు. అమాయక రైతులను మోసగించి అధిక ధరలకు శ్రీ కృష్ణా స్టోర్స్ యజమాని పై ఆరోపించారు. అందుచేత వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువుల విక్రయం నిలుపుదల చేసినట్లుగా తెలిపారు. వీరు చేసిన అక్రమాలను నివేదిక ద్వారా తనపై అధికారులకు తెలియజేశానని వారిపై చర్యలు తప్పవని, వారికి అపరాధ రుసుము నిమిత్తం పై అధికారులు వారికి నోటీసులు పంపిస్తారని తెలియజేశారు.అంతేకాకుండా తగు చర్యల నిమిత్తం పై అధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎరువులు విక్రయిస్తున్నప్పుడు రైతులకు రసీదు ఇవ్వకుండా అమ్మకాలు జరుపుతున్నారని అటువంటి వారిపై ఎఫ్ సి ఓ 1985 క్లాస్ 5 ప్రకారం చర్యలు తీసుకోబడతాయనితెలియజేశారు ఎరువులు సీజ్ చేసినందుకుగాను ఇకపై రైతులకు గ్రామ వ్యవసాయ సహాయకుల పర్యవేక్షణలో ఎరువులు విక్రయించబడతాయని వ్యవసాయ అధికారి తిరుపతి రావు తెలిపారు. ఎరువులు దుకాణాలు తనిఖీల్లో భాగంగా వ్యవసాయ శాఖ అధికారి తో పాటు వ్యవసాయ అధికారితోపాటు గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్ మరియు రాకేష్ పాల్గొన్నారు.