
-ఐసా నేతల మండిపాటు
ఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యమైపోయిందని పైసా నేతలు ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సదస్సులో వారు పాల్గొని దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేమన, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు శివ కుమార్ ఉరవకొండ నియోజకవర్గం కన్వీనర్ భీమేష్ మాట్లాడుతూ..
డిగ్రీ కళాశాలలో , విశ్వవిద్యాలయాలలో పూర్తిగా ప్రవేశాలు పడిపోయాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుచేసి రాష్ట్ర విద్య విధానానికి వెళ్లాలన్నారు.రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అనేది అందని ద్రాక్ష వలె మిగిలిపోవడం జరుగుతుంది ఇప్పటికే ఉన్నత విద్యలో జీవో నెంబర్ 77 వల్ల డిగ్రీ పీజీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పూర్తిగా రియంబర్స్మెంట్ రద్దు కావడం వల్ల అనేకమంది పేద మధ్య తరగతి విద్యార్థులు లక్షలాది రూపాయలను అప్పు చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించడం జరుగుతుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యార్థులకు హామీ ఇచ్చి ఇప్పటికి హామీని నెరవేర్చడం లేదు ఇలా అయితే రానున్న రోజుల్లో మరింత ఉద్యమాలను ఉధృతం చేసి జీవో నెంబర్ 77ను రద్దు చేసేంతవరకు ఐసా పోరాటాలు కొనసాగిస్తుందని హెచ్చరించారు
.ఈ కార్యక్రమం లో ఉరవకొండ నియోజకవర్గం నాయకులు వినయ్, హరి, వంశీ, సూరి, మంజు తదితరులు పాల్గొన్నారు.