
-విద్యార్థినిలపట్ల వికృత చేష్టలు. - లెక్కలు మాస్టారు లెక్క తేల్చిన గ్రామస్తులు. - నిందితుడుపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఉరవకొండ మన న్యూస్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు విద్యార్థినిల పట్ల వెకిలీ చేష్టలు వికృతి చేష్టలు ఓ గురువుకు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.
నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు మండలం, పెద్ద హోతూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లెక్కలు మాస్టారుగా సతీష్ పనిచేస్తున్నారు. 8, 9,10 తరగతుల్లో చదివే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. విద్యార్థులు గురువు కదా అని సహించారు. ఆ సహనం కూడా హద్దు మీరింది. విద్యార్థులు వెళ్లే వాష్ రూమ్ లో నక్కినక్కి చూసేవారు. అతని ప్రవర్తన పట్ల విసిగి వేసారి పోయిన ఆయా తరగతుల విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు శనివారం పాఠశాలలోకి వచ్చి సతీష్ కు దేహశుద్ధి చేశారు. పాఠశాలకు మాయని మచ్చ తెచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా అతనిపై వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు లెక్కలు మాస్టర్ సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.