మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ సెలక్షన్ ట్రయల్స్ ను ఈ రోజు అనగా తేదీ: 28.11.2024 గురువారం నాడు తేరుమైదానం గద్వాల యందు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కన్వీనర్ అబ్రహం మరియు జిల్లా అడహక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అడహక్ కబడ్డీ అసోసియేషన్ ఛైర్మెన్ శ్రీమతి స్నిగ్ధరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా డికె. స్నిగ్దా రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ క్రీడా అనేది శారీరక మరియు మానసిక సమన్వయానికి సంబంధించిన క్రీడా అని జోగులాంబ గద్వాల జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు తీసుకు వచ్చిన క్రీడాకారిణి లు మన దగ్గర ఉండడం మనకు గర్వకారణం అన్నారు. ఇప్పుడు జరగబోయే సెలక్షన్ ట్రయల్స్ లో చక్కటి ప్రదర్శనను కనబరిచి రాష్ట్రస్థాయిలో మన జిల్లా కు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని అభిలషించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కృష్ణవేణి రామాంజనేయులు మరియు శ్రీమతి బండల పద్మావతి వెంకట్రాములు గారు, ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్ గారు, కౌన్సిలర్ బండల పాండు, పి డి నగేష్, రాజారెడ్డి మరియు జిల్లా అడహక్ కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తిరుపతి, రజినీ కాంత్, సర్వేశ్వర్ రెడ్డి, కొత్త సురేష్, రాజశేఖర్, మంజునాథ్ గారు, పి ఈ టీ లు రాధ, రేష్మ, శాంతి, మోహన్ బాబు, దౌదర్పల్లి రాము, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు మరియు మహిళా క్రీడాకారిణిలు పాల్గొన్నారు.