మన న్యూస్ తవణంపల్లి జూలై-19 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీగా ₹4చొప్పున 260 కోట్లు నేడు విడుదల చేయడం హర్ష నీయమని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా/టీ.జనార్ధన్ కార్యదర్శి కె . మునిరత్నం నాయుడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తవనంపల్లి లో ప్రపంచ మామిడి దినోత్సవ సందర్భంగా 22వ తేదీన జరుగు మహాజన సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సబ్సిడీతో పాటు గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు, రాంపుల నిర్వాహకులు చెల్లించాల్సి₹8 ప్రభుత్వమే చొరవ తీసుకొని రైతుల అకౌంట్ లో ₹520 కోట్లు జమ చేసేందుకు పూనుకోవాలని వారు కోరారు. గతంలో గుజ్జు యజమానులు తెలిపిన విధంగా స్టాకు మిగిలిపోవడం, డిమాండు లేకపోవడం వంటి మాటలు బూటకమని నేడు రుజువుతోందని వారు పేర్కొన్నారు. అదే నిజమైతే నేడు ₹8 నుండి ₹10 చెల్లించేందుకు ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించి ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు, చంద్రమౌళి రెడ్డి, మోహన్ రెడ్డి , శరత్, రామచంద్ర రెడ్డి బాబురెడ్డి, చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.