గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు పంచామృత, సుగంధ ద్రవ్య పూర్వక నువ్వుల నూనె తైలంతో శ్రీ భవానీ శంకర స్వామి వారి మృత్తికా శివలింగానికి మరియు శనైశ్చర భగవానుని యొక్క మూర్తికి విశేష రీతిలో అనులోమ విలోమ ప్రక్రియలో మూలమంత్రాలను చదువుతూ మన్యుసూక్త విధానంతో మన్య సూక్తం లోని ప్రతి సూక్తానికి రుద్రం లోని సుక్తాలతో సంపుటికరణ చేస్తూ విశేష అభిషేకము తదుపరి హోమము అనంతరం పుష్పార్చన నిర్వహించడం జరుగుతుంది.
జాతకంలో శని దశలో ఉన్నవారికి, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి శ్రీ శనైశ్చర భగవానుని యొక్క అనుగ్రహంతో సకల దోషాలు తొలగి సంతోషంగా ఉంటారు.