మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తి పోతలపథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల రైతులతో ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..నాగమడుగు ఎత్తిపో తల పథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం రైతులు భూమిని ఇచ్చి సహకరిం చాలని అన్నారు.రైతుల అభిప్రాయం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు.ఈ సమావేశంలో వడ్డేపల్లి గ్రామానికి చెందిన రైతు నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ..పైపు లైన్ కోసం రైతులు ఇచ్చే భూమిపై రైతులకు హక్కులు ఉండాలని అన్నారు.గతంలో భూ సేకరణ జరిగినప్పుడు రైతులకు ఎకరాకు 17 లక్షల రూపాయలను చెల్లించారని ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఎకరాకు 30 లక్షల రూపాయలను ఇవ్వాలన్నారు.ఈ ప్రాజెక్టు వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్నందున వడ్డేపల్లి పేరు పెట్టాలన్నారు.ఈ సమావేశంలో తహసిల్దార్ భిక్షపతి,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు,సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్,సర్వేయర్ శ్రీకాంత్,రైతులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.