మన న్యూస్ ఐరాల జులై-18
పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఐరాల మండలం, చింతగుబ్బలపల్గె, మద్దిపట్లపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *"పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్"* పాల్గొన్నారు. అంతకుముందు చింతగుబ్బలపల్లె గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఐరాల మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గజమాలలు, దుశ్శాలువతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చింతగుబ్బలపల్లె గ్రామంలో 3 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించి.. ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ.. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరిస్తూ మరికొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే గ్రామాల్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కో- ఆర్డినేటర్ గిరిధర్ బాబు, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, ఐరాల సింగల్ విండో ఛైర్మన్ శేషాద్రి నాయుడు, నాయకులు మేదర్లమిట్ట మోహన్ నాయుడు, దేవాజీ, చంద్రశేఖర్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు , మహిళలు, ప్రజలు పాల్గోన్నారు.