మన న్యూస్ తవణంపల్లె జులై-18
మండలంలోని టి పుత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా ఈరోజు శుక్రవారం శ్రీ సీతా సమేత కోదండరాముల స్వామి వారు కల్పవృక్ష వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అలరించారు. ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు శుక్రవారం రాత్రి స్వామివారికి కల్పవృక్ష వాహన సేవను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కార్యక్రమానికి టి పుత్తూరు గ్రామం కు చెందిన మునిరత్నం రెడ్డి, కోతగొనిపల్లెకు చెందిన ఎం రమేష్ రెడ్డి, టి పుత్తూరుకి చెందిన సి చంద్ర శేఖర్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పి సిద్దేశ్వర రెడ్డి, పుత్తూరుకి చెందిన వెంకటరమణ రెడ్డి ఉభయ దారులుగా వ్యవహరించారు. ఈమెరకు ఆలయంలో ఉదయం అర్చక స్వాములు తిరుమంజనం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అలంకరించి, ప్రత్యేక పూజలు చేసి, ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం రాత్రి అర్చకులు చేత ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ సీతా సమేత కోదండ రాముల స్వాముల వారి ని అలంకరించి కల్పవృక్ష వాహనంపై అధిరోహించి మంగళ వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల నడుమ గ్రామ పురవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉత్సవ ఉభయ దారులు పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు.