Mana News:- ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడిగా ఉయ్యాలవాడ మాజీ సర్పంచ్ బోధనబోయిన గోపాలకృష్ణ యాదవ్ కుమారుడు బోధన బోయిన అరుణ్ కుమార్ యాదవ్ శ్రీశైలంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ .లాక వెంగళరావు యాదవ్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు పత్రం అందుకోవడం జరిగింది.గత ఐదు సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ స్థాయిలోనూ అనేక బీసీ సమస్యలపై పని చేస్తూ సంఘాన్ని పటిష్ట పరుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ సంఘం నిర్మాణానికి మరింత ప్రతిష్ట పరిచి విస్తృత పరిచేందుకు బీసీ సంఘల మధ్య మరింత ఐక్యతను పెంచేందుకు కృషి చేస్తానని బోధన బోయిన అరుణ్ కుమార్ యాదవ్ తెలియజేశారు