మన న్యూస్,తిరుపతి :- మంగళగిరిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ను రాష్ట్ర హస్తకళల నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు శ్రీవారి ప్రసాదాలను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఆయా జిల్లాలలోని ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ కళాకారులకు ఎటువంటి సహాయ చర్యలు తీసుకోవాలో వారు తయారు చేసిన వస్తువుల విలువ పెంచే విధంగా వాటికి అత్యంతమైన స్థానం కల్పించి ఆ వస్తువులకు జిఐ ట్వగింగ్, క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి పెరిగే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చర్చించి త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తామని మంత్రికి వివరించారు.