మన న్యూస్ సాలూరు జూలై 18:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. నా వలన నా నియోజకవర్గం ఉద్యోగులను నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా చేశాను కాని ఎవరిని బదిలీలు చేసి ఇబ్బంది పెట్టలేదు… నేను చేసానా, చేస్తా చెప్పండి. కక్ష సాధింపులకోసం అన్నీ శాఖల లో ఉద్యోగాలు తీయించేయడం, బదిలీలు మంత్రి సంధ్యారాణి చేస్తున్నారు.టీచర్స్ నీ సస్పెండ్ చెయ్యడం నేను ఎప్పుడు చూడలేదు. మంత్రి ఆదేశాలమేరకు ఈ దళిత గిరిజన, బీసీ ఉద్యోగాలకు మంత్రి అన్యాయం చేస్తున్నారు.చిన్న చిన్న ఉద్యోగస్తులను తీసేస్తున్నారు. నేను కాలి ఉద్యోగాలు ఉన్నదగ్గర ఇచ్చాను కాని మీ లాగా ఉద్యోగస్తులను తీసి వేరే వాళ్ళను వెయ్యడం ఇది కరెక్ట్ కాదు.అటెండర్ ని కూడా నియోజకవర్గం దాటి బదిలీలు చేయిస్తున్నారు. ఇదే నా చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్ పరిపాలన చెయ్యిమన్నారా మంత్రి సంధ్యారాణి కి మీరు అని రాజన్న ప్రశించారు.మంత్రి సంధ్యారాణి కి మూడో శాఖ ఉద్యోగాల తీసే శాఖ ఇవ్వాలి.జిల్లా అధికారులను కూడా అడుగుతున్న చిన్న చిన్న తప్పులకు కూడా తొలంగించేస్తారా.పిటిటి లకు అన్యాయం జరుగుతుంది. గిరిపుత్రుల నుండి 23 లక్షల స్వాహా చేసారు అప్పుడు మీ పీఓ, పీడీ ని సస్పెండ్ చేసారా? ఎందుకు చెయ్యరు? అవినీతి కనిపించినప్పుడు సస్పెండ్ చెయ్యాలి కదా? పత్రికలలో వరుస అవినీతి కధనాలు వచ్చినప్పుడు దర్యాప్తు చేసారా? ప్రశాంతి తప్పు చెయ్యలేదు దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం. మంత్రి తీరు మారదు అధికారులు మీరేనా ఆలోచించండి అని రాజన్న దొర ప్రశ్నించారు.