గూడూరు, మన న్యూస్: -రోటరీ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొణిదల ముని రామయ్య ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని దివి పాలెం ఎంపీపీ స్కూల్ వారికి 20వేల రూపాయలు విలువచేసే ఆరు స్టేషనరీ రాక్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ Rtn.వి.వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మా రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట గవర్నర్ మునిగిరేష్ మరియు వారి సోదరుడు ముని భాస్కర్ వారి తండ్రి కీర్తిశేషులు కొణిదల ముని రామయ్య గారి జ్ఞాపకార్థం ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ పాఠశాలలకు ఎంతో అవసరమైన ఈ స్టేషనరీ రాక్స్ అందించడం చాలా సంతోషకరమని అన్నారు . ఈ సందర్భంగా దాతలైన కొణిదల ముని భాస్కర్ మరియు రోటరీ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్ మాట్లాడుతూ మా తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం ఈ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చదువుతున్నారని వారికి బుక్స్ ని పెట్టుకునేందుకు ఎటువంటి సౌకర్యం లేదని ప్రధానోపాధ్యాయులవారు తెలియజేయగా, పిల్లలకు ఎంతో ఉపయోగపడే ఈ ఆరు రాక్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ సీనియర్ సభ్యులు బి.దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారి తండ్రి జ్ఞాపకార్థం ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం వారి తండ్రిని గుర్తుకు చేసుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందించ తగిన విషయమని అన్నారు. ప్రధానోపాధ్యాయులు ఎన్ మోహన్ దాస్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పిల్లలకు ఎంతో అవసరమైన ఈ రాక్స్ ను అందించినందుకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మా స్కూల్ కి మీ రోటరీ క్లబ్ ద్వారా ఒక ఆర్ఓ( వాటర్ ప్యూరిఫైయర్) సిస్టం ఇప్పించవలసిందిగా కోరారు. రోటరీ క్లబ్ సెక్రటరీ మల్లు విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, దాతలను అభినందిస్తున్నామని అలాగే మా రోటరీ క్లబ్ కు ఈ అవకాశం కల్పించిన ఈ పాఠశాల వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కుమార్ , రోటరీ సభ్యులు ఎన్ బాలకృష్ణం రాజు, B.V.Sridhar Reddy, ఎన్.వి రత్నం,
టి సురేష్ రెడ్డి, టీవీ రవికుమార్, జి జి నాయుడు, పి.నిరంజన్ రెడ్డి, ఎం.శ్రీధర్ నాయుడు, పి. రవీంద్రారెడ్డి,
ఎంసీ మల్లయ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.