గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు .
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం ఏల్లూరు,బురద గాలి కొత్తపాలెం పంచాయతీలలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వాటర్ ట్యాంకు గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు సామూహిక సీమంతాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని చెప్పడం ఆనందం గా ఉందని అన్నారు ఈ గ్రామాలలో గత టిడిపి ప్రభుత్వంలో అనేక రోడ్లు వేయడం జరిగిందని వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని తెలిపారు అయితే ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నాయుడు ,శివ కోటన్న ,సుధాకర్, బాబు ,తదితరులు పాల్గొన్నారు .