శంఖవరం/ ప్రత్తిపాడు మనన్యూస్ ప్రతినిధి:- కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ పధకాలు అమలు చేశామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని నియోజకవర్గ వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు ఒక ప్రకటన లో తెలిపారు. గిరిబాబు మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ -మోసం గ్యారంటీ కార్యకమాన్ని విజయవంతం చేయాలని మండలాల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రజలు కి ఈ ఏడాది పాలన లో ప్రజలకి జరిగిన నష్టాన్ని వివరించడానికే ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రాల్లో మండల కన్వీనర్ అధ్యక్షతన జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రచారం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలిపారు.