మన న్యూస్,ఎస్ఆర్ పురం:- పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమితులైన కృష్ణమనాయుడు ను జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ గురువారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీకి ఎనలేని సేవలు అందించి నేడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమితులైన కృష్ణమ నాయుడును గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాబు నాయుడు, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.