నర్వ మండల, Mana News :- నర్వ మండల పరిధిలోని లంకాల గ్రామంలో పురాతనం నుండి తరతరాల నుండి లంకాల గ్రామంలో కౌడి పిర్లను ప్రతిష్టించడం జరుగుతుంది. నర్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు భారీగా కౌడి సవారిలో పాల్గొనడం జరుగుతుంది. మరియు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగే మౌలాలి కౌడి పీర్ల దర్శనానికి భారీ ఎత్తున ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని కౌడి పీర్లకు మాలిజా పంచి అలాయి దులై అనుకుంటూ అలాయి ఆడుతూ ఎంతో ఘనంగా కౌడి పీర్ల సవారిని ఆడుతూ ఆనంద పరవశంలోకి వెళ్లి పోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కౌడి పీర్లు బాయి కి వెళ్లడం జరుగుతుంది. మరియు ఈ యొక్క కౌడి పీర్ల సవారి పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పశుసంవర్ధక,మత్స్యకార, పాడి పరిశ్రమ,క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కౌడి పీర్ల సవారిలో పాల్గొనడం జరిగింది. మౌలాలి కౌడి పీర్ల దగ్గర రాష్ట్ర మంత్రివర్యులు తులాభార కార్యక్రమంలొ పాల్గొనడం జరిగింది. మరియు మంత్రివర్యులు తులాభారంలో మంత్రి ఒకవైపు బెల్లం ఒకవైపు పెట్టి మంత్రి వాకిటి శ్రీహరి బరువుకు సమానంగా బెల్లాన్ని తూయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నర్వ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.