
ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ బోర్డుల మీద విద్యాబోధన, ఎప్సెట్ (ఎంసెట్), మెయిన్స్, నీట్, సిఎ, పోటీ పరీక్షలకు శిక్షణ - జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎం. హృదయ రాజు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి. జులై 17 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యా అధికారి, నోడల్ ఆఫీసర్ శ్రీ ఎం. హృదయ రాజు విద్యార్థుల కు సూచించారు. శ్రీ ఎం. హృదయ రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల అలంపూర్ ను సందర్సించి, ప్రేయర్ లో విద్యార్థుల తో ఇంటారాక్ట్ అయ్యి గైడ్ చేస్తూ పలు సూచనలు,ప్రభుత్వ కళాశాలల ప్రత్యేకతలను తెలిపారు.గౌరవ ఇంటర్మీడియట్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య సార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెరుగుదలకు, కార్పొరేట్ కళాశాల లకు దీటుగా జూనియర్ కళాశాలలో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చెప్పిస్తున్నారని తెలిపారు. అదే విదంగా అకాడమిక్ ఇయర్ మొదటి నుంచే ఇంటర్ విద్యార్థుల కు ఎప్సెట్ (ఎంసెట్), మెయిన్స్, నీట్, సిఎ,పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులకు ఏర్పాట్లు చేయించారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు మొదటి నుంచే తమ లక్ష్యం ను ఎంచుకొని, దాని సార్థకత కొరకు కష్టపడాలని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉంటారని గుర్తు చేశారు. ప్రతి రోజు విద్యార్థులు, అధ్యాపకులు ప్రేయర్ కు హాజరై విద్యార్థుల ను మోటివేషన్ చేయాలనీ తెలిపారు. కళాశాల అడ్మిషన్ టార్గెట్ ను చేరుకోవాలని అధ్యాపకులకు తెలిపారు. 100% ఉతీర్ణత సాధన కు ప్రణాళికలు రూపొందించుకొని విద్యా బోధన కొనసాగాలని తెలిపారు. అధ్యాపకులు డి. రాజు, ఎన్. రాముడు, రామచంద్రయ్య, రఘువీర్ కుమార్, సుధారాణి, వెంకటరాణి, మల్లయ్య, పూర్ణిమ, అభిజ్ఞ, మౌనిక, అధ్యాపాకేతర సిబ్బంది మునిస్వామి, రాఘవేంద్ర, శేక్షవలి విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారు.
