మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంను రీ-ఓపెనింగ్ చేశారు. నేటినుండి శుభకార్యంలు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని, ఎలాంటి శుభకార్యములైన చేసుకోవాలని కళ్యాణ మండపం స్థలదాత ధర్మరెడ్డి తమ్ముడు పోసిరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం కళ్యాణ్ మండపంకి పూజ నిర్వహించి రిఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దామోదర్ రెడ్డి, వెంకట్రారాముడు,లక్ష్మన్న, నాగేంద్రం, రఘురెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.