గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 17 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డలో సీడ్ ఉత్తనోత్పత్తిలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బిజెపి ప్రశ్నిస్తున్నది. వారం రోజుల క్రితం పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాత బస్టాండ్ లో ఒకరోజు ధర్నా నిర్వహించామని దాని ఫలితంగానే అధికారులలో చలనం వచ్చిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు తెలిపారు.
గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ధర్నాలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ
విత్తనాలు ఇచ్చిన కంపెనీలో ఎంత పంట పండిన తీసుకోవాలని రెండు క్వింటాలే కొంటామని చెప్పడం మోసం చేసినట్టని వివరించారు ప్రభుత్వం విత్తన కంపెనీలు సీడ్ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ రేట్ లో కంపెనీలు ,ఆర్గనైజర్ల పై నిర్వహిస్తున్న సమావేశంలో తమకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దిగివచ్చిన కంపెనీలు తాము రైతులకు అండగా ఉండి రైతుల పక్కన పోరాటం చేశామని అదేవిధంగా అధికారులకు సూచనలు చేయడంతో వారు కంపెనీ అధినేతలతో గట్టిగా మాట్లాడి కంపెనీ దిగివచ్చే విధంగా చేయడంపై జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ రైతుల పండించిన పంట మొత్తం కంపెనీలు తీసుకుంటాయని చెప్పడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ రైతుల పక్షాన ఉంటుందని వారికి ఏ సమస్య వచ్చిన తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరములు పట్టణ అధ్యక్షురాలు బాలిక జయశ్రీ జిల్లా ఉపాధ్యక్షుడు ధరూర్ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.