మన న్యూస్,తిరుపతి :- ఏజెన్సీ ప్రాంతాలలోని హస్తకళాకారులు తయారుచేసిన వస్తువులకు ప్రాముఖ్యత తీసుకొని వస్తామని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. గురువారం రంపచోడవరం, అరకు నియోజకవర్గాలలోని ఏజెన్సీ ప్రాంతాలు అయినా వేములవాడ పంచాయతీ సువర్లపాడు గ్రామంలో 40 మంది హస్త కళాకారుల నైపుణ్యంతో తయారుచేసిన వెదురు వస్తువులను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న హస్తకళల ను అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ హస్త కళాకారులు తయారుచేసిన వస్తువులకు జిఐ ట్యాగింగ్ తో పాటు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి అడవిలో దొరికే ముడిసరకు సరసమైన ధరలకు లభించేలా అటవీశాఖ అధికారుల తో చర్చలు జరిపి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వారు తయారు చేసిన అటవీ ముడి సరుకుతో చేసిన వస్తువులకు లాభాదాయకమైన ధరలు లభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారు ఆర్థికంగా బలపడేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి, అరకు పార్లమెంటు ఇంచార్జ్ డాక్టర్ గంగులయ్య పిఓసి రాజశేఖర్ రెడ్డి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.