ముగ్గురు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు
మన న్యూస్ సింగరాయకొండ:-
ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ సింగరాయకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోటయ్యగారి పట్టపు పాలెం సమీపంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ పై దాడి చేసి రెండులక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దాయిల ను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్లు ఎక్సైజ్ సిఐ మే డికొండ శివకుమారి మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పేర్కొంటూ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం చెలామణి జరుగుతుందని అందిన సమాచారం మేరకు పాకల గ్రామ పంచాయతీ పోటయ్యగారి పాలెం సమీపం లోని బకింగ్ హాం కాలువ వద్ద చెందిన దాడిలో భారీ మద్యం డంప్ ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.ఈ డంప్ లో గోవా కి చెందిన రెండు లక్షలకు పైగా విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వాటిని అక్రమంగా చెలామణి చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టు బయట పడిందని ఆమె వివరించారు. అక్రమ మద్యం నిల్వ, చెలామణి చేస్తున్న చినగంజాం మండలం కోడూరి వారి పాలెం కి ప్రళయకావేరి జయంత్ బాబు,విడవలూరు మండలం శ్రీ రామ్ నగర్ కి చెందిన జాన నాగార్జున, ఊళ్ల పాలెం కి చెందిన ఆరవ పవన్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్లు ఆమె తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా అక్రమ మద్యం చెలామణి, నిల్వలు చేసినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.