మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్మతులు చేస్తుంటే గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నరాని హాసన్ తెలిపారు హ్యూమన్ రైట్స్ అండ్ టైం కంట్రోల్ బ్యూరో జిల్లా అధ్యక్షులు హసన్ మాట్లాడుతూ రాజోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను చూసి చలించి తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయిస్తున్నానని జిల్లాలో ఉన్నటువంటి దాతలు కూడా ముందుకు వస్తే పాఠశాల అభివృద్ధి జరుగుతుంది పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అన్నారు కానీ మరోవైపు పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుంది అన్నారు నిత్యం రాత్రి అయితే చాలు మందు బాబులు చిందులేస్తున్నారని పాఠశాలలో క్లాసులు జరుగుతున్న సమయంలోనే గ్రౌండ్లో బయట వ్యక్తులు వచ్చి క్రికెట్ ఆడటం వల్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుందని స్కూల్లో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరకు బయట వ్యక్తులు వచ్చి స్నానాలు చేయడం ఆటోలు కడగడం వంటివి చేస్తున్నారని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు