శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా ఆకస్మికంగా కత్తిపూడి లో శ్రీ భక్తాంజనేయ ఫెర్టిలైజర్స్ షాపులో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 249200 రూపాయల విలువ చేసే వరివిత్తనాలు, రూ.205347 విలువ చేసే ఎరువుల అమ్మకాలు నిలుపుదల చేయడం జరిగింది. గోడౌన్ లో స్టాకు మరియు రిజిస్టరు లో ఉన్న స్టాకు వ్యత్యాసము మరియు వివిధ ఫారాలు లేకపోవడం వలన తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శంషి, విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎస్. ఐ.పి. శివ రామకృష్ణ, వ్యవసాయ అధికారి పి. గాంధీ, ఎఈఓ, ఆర్.మౌళి ప్రసాద్ పాల్గొన్నారు.