నియోజకవర్గానికి ఎన్ హెచ్ ఎస్ రహదారులు మరిహారం లాంటిది జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్రమాలకు దందాలకు చోటు లేదని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గత నెల రోజులు నుండి అక్రమాలకు నిలయంగా జీడి నెల్లూరు జరుగుతోందని కథనాలపై ఆయన స్పందించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అన్ని ఎన్ హెచ్ ఎస్ హైవే లకు మట్టి వెళ్లాయని అవి రోడ్డు పనులకు మాత్రమే వెళ్లిందని ఆయన అన్నారు. ఎన్ హెచ్ ఎస్ హైవే లు గంగాధర నెల్లూరు నియోజకవర్గనికి మణిహారం లాంటిదని అని అన్నారు. ఎన్ హెచ్ ఎస్ రహదారులను చూసే గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి కంపెనీలు వస్తున్నాయని అన్నారు. నియోజకవర్గంలో రైతు లు పౌరుడు భూములకు ఎర్ర మట్టి తరలించి వ్యవసాయం చేసుకోవచ్చని దానిని అడ్డుకునే ప్రయత్నం తాను చేయనని తెలిపారు. ఎర్రమట్టి నియోజకవర్గం నుంచి ఎక్కడికి తరలిపోలేదని బిల్లులు లేని మట్టి కూడా ఎన్ హెచ్ ఎస్ హైవే రోడ్లు మాత్రమే వెళ్లిందని పేర్కొన్నారు. ఎంతమంది తప్పుడు ఆరోపణలు నాపై చేసిన నా చొక్కాకు మరకఅంటదని నియోజకవర్గ అభివృద్ధి చేయడమే నా అ జెండాని అన్నారు.