బద్వేల్: జులై 6: మన న్యూస్: బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం కాల్వపల్లె గ్రామంలో తండ్రి కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదశాయ అలముకున్నాయి. గ్రామంలో మున్నెల్లి సుబ్బరాయుడు ( 70) అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందాడు మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలదు
వెంకటరమణ గత పది సంవత్సరాల క్రితం కువైట్ లో చనిపోయాడు ఆరోగ్యం బాగాలేక. ఉన్నటువంటి పెద్ద కుమారుడు వెంకటసుబ్బయ్య కువైట్ లో పనిచేస్తూ పదిరోజుల క్రితం నివాసం ఉంటున్న నెల్లూరుకి వచ్చాడు. ఈరోజు పొద్దున తండ్రి మరణ వార్త తెలియడంతో నెల్లూరు నుంచి కాల్వపల్లి కి వచ్చి తండ్రి దహన సంస్కారాలకు కావలసిన సామాన్లు కొరకు బద్వేల్ కి వచ్చి తిరుగు ప్రయాణంలో బద్వేల్ చెరువు కట్ట మీదికి రాగానే కళ్ళు తిరుగుతున్నాయనివి ద్విచక్ర వాహనం ఆపాడు అతని వెంట ఉన్నా అతని బంధువు వెంటనే ఆటోలో ఎక్కించి ఇంటికి పంపించాడు ఇంటి దగ్గరికి రాగానే ఆటో దిగుతుండగానే అక్కడికక్కడే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.
వెంకట సుబ్బయ్య (వయస్సు 45)