మన న్యూస్,తిరుపతి :- ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షులుగా శేషాద్రి మొదలియార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు చేతుల మీదుగా శేషాద్రి మొదలియార్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శేషాద్రి మొదిలియార్ మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో బీసీల బలోపేతానికి తన వంతుగా శక్తివంచిన లేకుండా కృషి చేస్తానన్నారు. చట్ట ప్రకారం బీసీలకు రావాల్సిన రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల కోసం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు నేతృత్వంలో పోరాటం చేస్తామన్నారు. తిరుపతి నియోజకవర్గంలోని 50 డివిజన్లో ఉన్న బీసీల అందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా కమిటీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానన్నారు. తనను నమ్మి నగర అధ్యక్షులుగా నియమించిన జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజు గౌడ్, నియమిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజ్ గౌడ్, సంఘం జిల్లా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మునస్వామి కూడా పాల్గొన్నారు.