గూడూరు, మన న్యూస్:- ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, గూడూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో “మధ్యవర్తిత్వం — దేశం కోసం” అనే అంశంపై అవగాహన ర్యాలీ మరియు ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గూడూరు సెవెంత్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ వెంకట నాగ పవన్ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ప్రజల మద్దతుతో కూడిన ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం కక్షిదారులకు రాజీ మార్గం ప్రాముఖ్యత, న్యాయ విధానాల పరిధిలో ఉండే పరిష్కార మార్గాలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ శ్రీమతి బి.వి. సులోచన రాణి , సబ్ జడ్జి శ్రీమతి బి. గాయత్రి , డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ తాజుద్దీన్, న్యాయవాదులు ఆరవ పార్వతయ్య, షేక్ గౌస్ బాషా, కోటేశ్వరరావు, ఏడుకొండలు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.క్లిష్టమైన న్యాయ ప్రక్రియల మధ్య, రాజీ మార్గం ద్వారా వేగవంతమైన న్యాయనిర్ణయాలు సాధ్యమవుతాయని, ప్రజలు దీనిని మరింతగా వినియోగించుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు.